Brahmamudi : ప్రాణాపాయ స్థితిలో స్వప్న.. కావ్య ప్లాన్ అదే!
on Jun 26, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -757 లో..... యామిని తన ప్లాన్ ఏంటో క్లియర్ గా కావ్యకి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది. వెంటనే కిందకి వెళ్లి అక్క ఎక్కడ అని అడుగుతుంది. పాప ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది టీకా కోసమని రుద్రాణి అనగానే కనీసం మీకు తోడు వెళ్లాలన్నా బుద్ది కూడా లేదా అని వాళ్లని తిడుతుంది కావ్య. అప్పుడే హల్లో ఉన్న వాళ్ళందరూ ఏమైందని కావ్యని అడుగుతారు. అక్క గురించి చెప్తే అందరు కంగారు పడుతారని ఏం లేదని కావ్య అంటుంది. కావ్య వెళ్తుంటే అప్పుడే రాజ్ వస్తాడు. మీతో మాట్లాడాలి కళావతి గారు అని రాజ్ అనగానే.. నేను బయటకు వెళ్ళాలి ప్లీజ్ ఏమనుకోకండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి వస్తానంటూ కావ్య బయటకు వెళ్తుంది.
మరొక వైపు స్వప్న హాస్పిటల్ కి వెళ్తుంటే డ్రైవర్ కార్ డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత స్వప్నకి కావ్య ఫోన్ చేస్తుంటే ఫోన్ అఫ్ వస్తుంది. హాస్పిటల్ కి వెళ్లి స్వప్న గురించి అడుగుతుంది. ఎవరు రాలేదని వాళ్ళు చెప్పగానే కావ్య ఇంకా టెన్షన్ పడుతుంది. స్వప్న తన ఫోన్ ఎక్కడ అని చూసుకుంటుంది. ఇదేనా మేడం అని డ్రైవర్ అంటాడు. దాంతో స్వప్నకి తను ప్రాబ్లమ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది. మరొకవైపు కావ్యకి ఒక ఐడియా వస్తుంది. అన్ని కార్ లలో జీపీఎస్ ట్రాకర్ ఉంది కదా అని మేనేజర్ కి ఫోన్ చేసి లొకేషన్ ట్రేస్ చేయమని చెప్తుంది.
ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి మా వాళ్ళు మీ అక్క ని ఏం చేస్తారోనని అంటుంటే.. వాళ్లకి అంత సీన్ లేదు మళ్ళీ కాల్ చేస్తానని కావ్య మాట్లాడుతుంది. దాంతో యామిని అయోమయంలో పడుతుంది. నేను ఎంత ఆశగా వస్తే కళావతి గారు ఇలా చేసారని రాజ్ డిస్సపాయింట్ అవుతాడు. వస్తుందని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. నన్ను ఇక్కడికి యామిని పంపించిందని రాజ్ అనగానే తను పంపించడం ఏంటని అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరికి డౌట్ వస్తుంది. తరువాయి భాగంలో స్వప్న కిడ్నాప్ గురించి ఇంట్లో తెలుస్తుంది. మరొకవైపు యామిని దగ్గరికి అప్పు వెళ్లి చెంపచెల్లుమనిపిస్తుంది. అదంతా రాజ్ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



